అంకురం ఫౌండేషన్
తెలుగు నిజంగానే తగ్గిపోతోందా? మనకంటే పక్క రాష్ట్రాల వాళ్ళు తమ భాష మీద ఎక్కువ ప్రేమ చూపిస్తారా? తెలుగు 22వ శతాబ్ధం లోపే అంతరిస్తుందా?
ఆ ప్రశ్నలు మనందరికీ ఆందోళన కలిగించేవే. కాకపోతే నిజం అంత దారుణంగా లేదు। ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తగ్గుతుండవచ్చు కానీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే తెలుగు ఇతర దేశాల్లో బాగా పెరుగుతోంది। చరిత్రలోనే మొదటిసారిగా తెలుగు వాళ్ళు ప్రపంచమంతా విస్తరించారు। భారత్ వెలుపల తెలుగు వారు ఒక వెలుగు వెలుగుతున్నారు। న్యూజిలాండ్ నుంచి అమెరికా దాకా ప్రతి దేశంలోనూ తెలుగు మాట్లాడడం కనిపిస్తుంది।
కాకపోతే ఒక అభివృధ్ధి చెందుతున్న భాషకి వుండాల్సిన కొన్ని లక్షణాలు కనిపించవు। ముఖ్యంగా తెలుగు సాహిత్యం ఆంధ్ర, తెలంగాణల బైట అంతగా అందుబాటులో ఉండదు। అంకురం ఫౌండేషన్ ఈ సమస్యని సాధించటానికి పుట్టింది।
మరి ప్రపంచంలో ఏ మూలైనా ఏ తెలుగు పుస్తకాన్ని కొని చదివే వీలు కల్పించడంలో డబ్బు వుందా? అంకురం ఫౌండేషన్ పరిశోధనలో తేలిందేమంటే కోట్లు లేవేమోగానీ, చిల్లపెంకులయితే కాదు। కాకపోతే, పుస్తకాల కాపీ దొంగతనం ఎక్కువ కాబట్టి రచయితలు, పబ్లిషర్లు చాలా సంకోచంలో వున్నారు।
ఇక్కడ మంచి వార్త ఏమిటంటే తెలుగు పుస్తకాల్ని కాపీ దొంగతనం లేకుండా భారత్ బైట అమ్మడానికి (డిజిటల్ రైట్స్) మంచి టెక్నాలజీ వచ్చింది। పాశ్చాత్య దేశాల్లో కిండల్ (అమజాన్), నుక్ (బారన్స్ & నోబుల్), గూగుల్ బుక్స్, కోబో, యాపిల్ బుక్స్ లాంటి ప్లాటఫాంలు ఈ టెక్నాలజీ తో వున్నాయి। కాకపోతే, ఇవ్వన్నీ నేర్చుకుని, పుస్తకాల్ని అప్లోడు చేసి, మార్కెటింగ్ చేసుకునే ఓపిక ఎంతమందికి వుందనేది ప్రశ్న. ఇక్కడే అంకురం ఫౌండేషన్ సహాయం చెయ్యగలదు।
మీరు రచయిత అయినా పబ్లిషర్ అయినా మీకు అంకురం సహాయం చెయ్యగలదు। మమ్మల్ని సంప్రదించండి।